నిజమైన సంక్రాంతి

-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580 బ్రతుకులోని దుర్గుణాలుభోగి మంటల్లో కాల్చిసుగుణాల ఆభరణాలునిలువెల్లా ధరించాలి ప్రవర్తన లో పరివర్తనమధుమాసమై రావాలిపెద్దవారి దీవెనలుసెలయేరులై పారాలి కాసింత మనిషితనముమనసులోన క్షమాగుణముపూలై పరిమళించాలిప్రేమ వనమే కావాలి సంపద ఎంత ఉన్నామానవత్వం తరిగితేజీవితాన గుండు సున్నఅక్షరాల నిజమన్న! సంస్కారం నీదైతేనైతిక విలువలు తోడైతేజీవితాల్లో నవ కాంతిఅప్పుడే నిజ సంక్రాంతి