మల్లాపూర్,ఆగస్టు21,(నవగీతం):మల్లాపూర్ మండలం వేంపల్లి లో గత 15 రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మరణించిన గణవేని మహేష్ కుటుంబానికి యువజన కాంగ్రెస్ నాయకుడు పోతు శేఖర్, సంధ్యారాణి (4వ వార్డు సభ్యురాలు) కుమార్తె హద్విత, జన్మదినం సందర్భంగా 25 KG రైస్, నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. పుట్టినరోజు నా అనవసర ఖర్చులు చెయ్యకుండా నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన పోతు రాజశేఖర్ కుటుంబాన్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో 10 వార్డ్ మెంబెర్ మిట్టపల్లి జలపతి రెడ్డి, గ్రామస్తులు, గోపీనేని రాజేష్,శ్రీకాంత్ నాయక్, నానం రాకేష్,తదితరులు పాల్గొన్నారు