నిప్పుల కొలిమిలా కోరుట్ల.. కర్ఫ్యూను తలపిస్తున్న గాంధీ రోడ్!

నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలో ఎండలు మండిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నేడు పరాకాష్టకు చేరుకున్నాయి. పట్టణంలో రద్దీగా ఉండే గాంధీ రోడ్ మధ్యాహ్నం సమయానికి నిర్మానుష్యంగా మారింది.సాధారణంగా వాహనాల రాకపోకలు, ప్రజల కోలాహలంతో కిక్కిరిసిపోయే ఈ ప్రధాన రహదారి, నేడు మధ్యాహ్నం 1:55 గంటల సమయంలో జన సంచారం లేక వెలవెలబోయింది. ఎండ తీవ్రతకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో, గాంధీ రోడ్ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. అడపా దడపా తిరుగుతున్న వాహనదారులు కూడా ఎండ వేడికి అల్లాడిపోతున్నారు....