నిరంతరం వైద్య సేవలో బోడేపూడి వైద్య శిబిరం
నవగీతం, వైరా: వైరా మండల కేంద్రంలోని వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ప్రతి నెల మూడవ ఆదివారం బోడేపూడి కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోడేపూడి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం బోడేపూడి వైద్య శిబిరం ద్వారా షుగర్, బిపి, కొలెస్ట్రాల్, గ్యాస్, అల్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న 425 మంది పేద, మద్యతరగతి ప్రజలకు డాక్టర్ చీకటి భార్గవి, డాక్టర్ జట్ల రంగారావు, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు ఉచితంగా వైద్య సేవలు అందించారు. బోడేపూడి వైద్య శిబిరం ద్వారా నెల రోజులకు...