నిరాదరణకు గురైన నీటి ట్యాంకుకు 20 ఏళ్ల తర్వాత విముక్తి
పునరుద్ధరణ పనులకు శ్రీకారం నవగీతం ,కోరుట్ల ప్రతినిధి: గ్రామంలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా గత 20 సంవత్సరాలుగా నిరాదరణకు గురై, కనీసం శుభ్రం చేయడానికి కూడా వీలులేకుండా ఉన్న మంచినీటి ట్యాంకుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గురువారం నాడు కథలాపూర్ సర్పంచ్ న్యావనంది శేఖర్, ఉప సర్పంచ్ చాట్పల్లె ప్రసాద్ మరియు కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ ట్యాంకు పునరుద్ధరణ పనులను ఘనంగా ప్రారంభించారు. రెండు దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, ట్యాంకును సమూలంగా శుభ్రం చేయడంతో పాటు, భవిష్యత్తులో నిర్వహణ సులభతరం...