నిరుపయోగంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు కేటాయించాలి

కరీంనగర్, అక్టోబర్5,(నవగీతం) కరీంనగర్ జిల్లాలోని బద్దిపల్లి, వెలిచాల గ్రామాల్లో నిర్మించిన సుమారు 2,500 ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కోరుతూ జనసేన పార్టీ వీర మహిళ నాయకురాళ్లు రాగుల శిరీష, గుండ శకుంతల, కందకట్ల స్వరూప జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బద్దిపల్లి, వెలిచాల గ్రామాల్లో సుమారు 2,500 ఇళ్లను నిర్మించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ ఇళ్లలో ఎవరూ నివసించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయని పేర్కొన్నారు....