నిర్ణీత గడువులోగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, అక్టోబర్08,(నవగీతం) జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనుల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, చేపట్టాల్సిన తదుపరి పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణంలో ఎలాంటి జాప్యం...