నిర్దేశించిన ఉపాధి హామీ లక్ష్యాలను చేరుకోవాలి

ఉపాధి హామీ పని ప్రదేశంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి..జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కథలాపూర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంపుపై ప్రత్యేకంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో మరిన్ని కూలీలను ఉపాధి హామీ పనుల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో పనుల అందుబాటును పెంచాలని ఆదేశించారు. పనుల...