నిర్మల్ ఉత్సవాల ఏర్పాట్లను వెంటనే ప్రారంభించండి
నవగీతం, నిర్మల్ ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై సమీక్షించారు.గత సంవత్సరం నిర్మల్ ఉత్సవాలకు మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. ఈసారి కూడా అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం సిద్ధం చేయడం, సుందరీకరణ, మరుగుదొడ్లు, లైటింగ్, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి,...