నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నవగీతం, మెట్ పల్లి రూరల్: జగిత్యాల జిల్లా మెట్ పెల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఆయన సమీక్షించి, లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఇటుకలు, ఇసుక, సిమెంట్ వంటి సామగ్రి ధరలు మరియు వాటి నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించాలని సూచించారు. నిర్మాణ పనులు ఆలస్యం...