నీటి శుద్ధి ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.. కలెక్టర్
నవగీతం,ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో గురువారం తాగునీటి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలిస్తూ జిల్లా అధికారుల బృందం మిషన్ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా 145యం.ఎల్.డి సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని వివిధ విభాగాలను అధికారులు పరిశీలించారు. ఫిల్టర్ హౌస్, సెడిమెంటేషన్ ట్యాంకులు, క్లారిఫికేషన్ ప్రక్రియలు, శుద్ధి విధానాలపై సమగ్రంగా ఆరా తీశారు. నీటి శుద్ధి ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని...