నీళ్ల ట్యాంకు ఓవర్‌ఫ్లోతో నీరు వృధా – వాహనదారులకు ప్రమాదం

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న నీళ్ల ట్యాంకు నుంచి ప్రతిరోజూ నీరు వృథాగా ట్యాంకు నిండి రహదారిపై పొర్లిపోతు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ సమస్య గతంలో బైరి రాధ సర్పంచ్‌గా ఉన్న కాలం నుంచే కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.అనంతరం బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ రాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్య ట్యాంకు నిండిపోవడంతో...