navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 11:29 am Digital Edition : NAVAGEETAM

నూతనంగా ఎన్నికైన వెలమ సర్పంచ్ ఉప సర్పంచ్ లను సన్మానించిన ఎమ్మెల్యే

వగీతం, జగిత్యాల

జగిత్యాల పట్టణ పద్మనాయక కళ్యాణ మంటపం లో పద్మనాయక వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యం లో 2026 సంవత్సర నూతన క్యాలండర్ ను  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. జిల్లా లో నూతనంగా సర్పంచులు,ఉప సర్పంచ్ గా ఎన్నికైన వెలమకుల బాందవులను సత్కరించి అనంతరం ప్రముఖ విద్యావేత్త శిశు మందిర్, గోదావరి వ్యాలీ వ్యవస్థాపకులు కాసుగంటి సుధాకర్ రావు  అనారోగ్యం తో మరణించగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆయిల్నేని సాగర్ రావు,మాజీ అధ్యక్షులు పురుషోత్తం రావు,ముప్పాళ్ళ రామచందర్ రావు ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్ రావు,కార్యవర్గ సభ్యులు,సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు