navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 5:27 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నూతన కోర్టు భవన నిర్మాణానికి వినతి పత్రం అందజేత

హైకోర్టు రిజిస్ట్రార్ ని కలసిన మెట్ పల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు

నవగీతం, మెట్ పల్లి:

మెట్ పల్లి కోర్టు ఆవరణలో నూతనంగా ఐదు కోర్టుల భవన నిర్మాణం కోసం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ యస్. గోవర్ధన్ రెడ్డిని శుక్రవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రామ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత మెట్ పల్లి కోర్టు బిల్డింగ్ శితిలావస్థకి చేరుకున్నందున, దాని స్థానంలో నూతన కోర్టు భవనం నిర్మించాలని వినతిపత్రం అందించమన్నారు. అలాగే రాబోవు నూతన కోర్టుల కోసం, బార్ అసోసియేషన్ గది, మండల్ లీగల్ సర్వీసెస్ కార్యాలయం, మీడియాషన్ సెంటర్ మరియు క్లయింట్స్ వెయిటింగ్ గది కోసం కొత్త గదుల్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కోర్టుకి ఆనుకుని ఉన్నా 38 గుంటల ఖాళీ ఎస్సారెస్పి స్థలం కూడా కోర్టుకి కేటాయించేలా కృషి చేయాలని కోరినట్టు పేర్కొన్నారు. అనంతరం బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ. నర్సింహారెడ్డి, లా సెక్రటరీ పాపిరెడ్డి లని కలసి పలు కోర్టు మరియు న్యాయవాదుల సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆయన వెంట నూతన బార్ కౌన్సిల్ సభ్యులు అనంత సేన రెడ్డి, హైకోర్టు న్యాయవాదులు అల్లూరి దివాకర్ రెడ్డి, ఎ. వినయ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, చెర్లపల్లి ఆనంద్ గౌడ్, ఒజ్జెల శ్రీనివాస్, బిగుల్లా శంకర్ ఉన్నారు.