నూతన ప్రభుత్వ కార్యాలయ భవనాలతో ప్రజలకు మెరుగైన సేవలు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగిత్యాల,ఆగస్టు21,(నవగీతం):జిల్లాలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ధరూర్ క్యాంప్‌లో నూతనంగా మంజూరైన పలు ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగుల మరియు ట్రాన్స్‌జెండర్ సాధికారిత శాఖ మంత్రి...