నేరాల నియంత్రణలో, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకం: డిఎస్పి రాములు
పొరుమల్ల గ్రామంలో 16 సీసీ కెమెరాల ప్రారంభం నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలలో భాగంగా శనివారం మెట్‌పల్లి డీఎస్పీ రాములు మేడి పల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోని పొరుమల్ల గ్రామo లో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుత...