navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 12:41 pm Digital Edition : NAVAGEETAM

న్యాయవాదిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం.

కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్

నవగీతం, కోరుట్ల

సిద్దిపేట కోర్టు ఆవరణలో న్యాయవాది కుంచెం అశోక్ లీగల్ నోటీస్ పంపించారని ప్రత్యర్థులు భౌతికంగా దాడి చేయడం హేయమైన దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ న్యాయ వ్యవస్థను అవమానించిన వారిపై చర్య తీసుకోవాలని కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కోరుట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిద్దిపేట జిల్లాలోని అన్ని కోర్టుల విధులు నిలిపి వేసి, న్యాయవాదులు కోర్టుల ఎదుట ధర్నా నిర్వహించారని న్యాయవాదులపై జరుగుతు న్న దాడులు ఆందోళనకరంగా, ప్రజాస్వామ్యానికి ప్రమాదక రమని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదులపై ఇలాంటి భౌతిక దాడులు జరగకుండా నిరోధించాలంటే “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్” అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. సిద్దిపేట న్యాయవాదిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ,బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను కోరారు. న్యాయవాదుల భద్రతకు భరోసా కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్ హెచ్చరించారు