పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు
పొలాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : పదవ తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన వంటి అంశాలను కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి...