navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 4:10 pm Digital Edition : NAVAGEETAM

పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు

మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మేకల సతీష్

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

అహర్నిశలు కష్టపడి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మల్లాపూర్ మండల బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు మేకల సతీష్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్క విద్యార్థికి పేరుపేరునా శుభాభినందనలు తెలియజేస్తున్నానని, ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు సహనాన్ని కోల్పోవద్దని ఆత్మహత్యల వైపు ప్రేరేపించవద్దని విజయం కొరకు అహర్నిశలు పనిచేస్తే కచ్చితంగా విజయం మన వశం అవుతుందని ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకుండా తిరిగి ప్రయత్నంలో బాగా చదివి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.