పదవ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం
నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 500కు పైగా మార్కులు సాధించిన 18 మంది విద్యార్థులను గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి వార్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ ఏడాది పాఠశాల నుండి పరీక్షలకు హాజరైన 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, వారిలో 18 మంది 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. అలాగే ఒక...