navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 7:31 am Digital Edition : NAVAGEETAM

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు – పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ

నవగీతం, కొడిమ్యాల:

కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వి. శ్రీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు పాఠశాలలో గడిపిన తమ అనుభవాలను ఉపాధ్యాయులతో సహచర విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం గ్రామ యువత సభ్యులు బి. శశాంక్, రవి, ఎం. జగదీష్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.పరీక్షలను ఎలా రాయాలి, పరీక్షా కేంద్రంలో విద్యార్థులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి సభను ఉత్సాహభరితంగా మార్చారు.