పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు – పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ
నవగీతం, కొడిమ్యాల: కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వి. శ్రీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు పాఠశాలలో గడిపిన తమ అనుభవాలను ఉపాధ్యాయులతో సహచర విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం గ్రామ యువత సభ్యులు బి. శశాంక్, రవి, ఎం. జగదీష్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.పరీక్షలను ఎలా...