పదేళ్ల పోరాటానికి గుర్తింపేది?
హైదరాబాద్ (నవగీతం ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న సమయంలో పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, రాజకీయ ఇబ్బందులు, ఆర్థిక భారాలు ఎదురైనా పార్టీని వీడకుండా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పనిచేసినవారే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పునాది వేశారు. అయితే అధికారం వచ్చిన తర్వాత తమ కష్టానికి తగిన గుర్తింపు దక్కడం లేదనే భావన కొంతమంది పాత కార్యకర్తల్లో పెరుగుతోంది. ఇది కేవలం పదవులు దక్కలేదనే...