పదో తరగతి సాధారణ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా పరిధిలో నిర్వహించనున్న పదో తరగతి సాధారణ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు జిల్లా పోలీసు అధికారి అశోక్ కుమార్ తెలిపారు.మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు జిల్లాలోని 68 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో, ఆయా కేంద్రాల వద్ద ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుంపులుగా నిలబడరాదని సూచించారు. అలాగే...