navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 2:15 pm Digital Edition : NAVAGEETAM

పద్మశాలీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య

నవగీతం,జగిత్యాల

దేశంలో ప్రత్యేకమైన, గొప్ప వృత్తి నైపుణ్యాన్ని కలిగిన ఘనత కేవలం పద్మశాలీకే ఉందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య,  జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కొనియాడారు. ఆదివారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి పద్మశాలి కుల సంఘంకు 6 గుంటల స్థలం ప్రోసీడింగ్ కాపీ ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు. పద్మశాలీలు సంఘటితమై ఐకమత్యంతో మెదిలి తమ గౌరవాన్ని, ప్రతిష్టతను పెంచుకోవాలని సూచించారు. చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించినప్పుడు మాత్రమే తమ న్యాయమైన కోర్కెలు సాధించు కోగలుగుతామన్నరు. పార్టీలకతీతంగా చట్టసభలకు పద్మశాలీ బిడ్డలను పంపించుకోవాల్సిన అవశ్యకతను గుర్తించుకోవాలన్నారు.