పద్మ పురస్కరాలకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు.
నవగీతం,హైదరాబాద్ పద్మ భూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచి గడ్డమణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్, వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, పాల్కొండ విజయానంద్ రెడ్డి, పశుసంవర్థక రంగంలో మామిడి రామా రెడ్డి, విద్యా-సాహిత్య రంగాల నుంచి మామిడాల జగదీశ్ కుమార్, వెంపటి శశి శేఖర్, వెంపటి కుటుంబ శాస్త్రి, కళా రంగం...