పరిశుభ్రత వర్షాకాల జాగ్రత్తలపై అవగాహన
నవగీతం (రాయికల్ ప్రతినిధి) ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాయికల్ మున్సిపాలిటీ 9వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, 9వ వార్డు కౌన్సిలర్ బత్తిని మహేశ్వరి–నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సభలో వారు మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్నందున ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురికి కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు వంటి వ్యర్థాలను వేయకుండా చెత్త బండికి అందించాలని కోరారు. కాలువల్లో చెత్త పేరుకుపోవడం...