navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 1:09 pm Digital Edition : NAVA GEETAM

పర్యావరణ పరిరక్షణకు 800 స్టీల్ ప్లేట్ల విరాళం

స్వర్గీయ నత్తి లక్ష్మీరాజాం జ్ఞాపకార్థం దుర్గాదేవి సేవా సమితికి అందజేత

మల్లాపూర్, నవగీతం ప్రతినిధి: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన నత్తి శేఖర్, నత్తి రాము, లక్ష్మణ్‌లు దుర్గాదేవి సేవా సమితికి 800 స్టీల్ ప్లేట్లను విరాళంగా అందజేశారు. తమ తండ్రి స్వర్గీయ నత్తి లక్ష్మీరాజాం జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందించడం విశేషం.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా దుర్గాదేవి సేవా సమితి సభ్యులకు స్టీల్ ప్లేట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన స్టీల్ ప్లేట్లను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని పేర్కొన్నారు. సామాజిక సేవలో భాగంగా తమ తండ్రి జ్ఞాపకార్థం స్టీల్ ప్లేట్లను విరాళంగా అందించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో విజన్ స్కూల్ కరస్పాండెంట్ నత్తి శేఖర్, నత్తి రాము, మొదటి వార్డు సభ్యుడు, లక్ష్మణ్, ఎనిమిదో వార్డు సభ్యుడు, రాఘవపేట గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, దుర్గాదేవి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.