పర్యావరణ పరిరక్షణకు 800 స్టీల్ ప్లేట్ల విరాళం

స్వర్గీయ నత్తి లక్ష్మీరాజాం జ్ఞాపకార్థం దుర్గాదేవి సేవా సమితికి అందజేత మల్లాపూర్, నవగీతం ప్రతినిధి: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన నత్తి శేఖర్, నత్తి రాము, లక్ష్మణ్‌లు దుర్గాదేవి సేవా సమితికి 800 స్టీల్ ప్లేట్లను విరాళంగా అందజేశారు. తమ తండ్రి స్వర్గీయ నత్తి లక్ష్మీరాజాం జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందించడం విశేషం. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, తెలంగాణ...