navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 6:28 pm Digital Edition : NAVAGEETAM

పలువురిని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

నవగీతం, చొప్పదండి:

చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దళిత యువకుడు లింగంపల్లి నాగరాజు  ఇటీవల వడదెబ్బ తగిలి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం పరామర్శించి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చి ఇటీవల ఓ ఆర్ ఆర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పెద్దిరెడ్డి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ గన్ను శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు గాజంగి రాములు, కట్టెకోల లక్ష్మణ్, మార్కెట్ డైరెక్టర్ చుప్ప శ్రీనివాస్ , కట్టెకోల శ్రీనివాస్, బండారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు