navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 3:39 pm Digital Edition : NAVAGEETAM

పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

గాలికుంటు వ్యాధి అనేది పశువులకు వచ్చే ఒక వైరల్ వ్యాధి. దీనిని నివారించడానికి టీకాలు వేయించడం ఒక్కటే సరైన మార్గం అని పశు వైద్యులు డాక్టర్ గంగ ప్రసాద్ అన్నారు. తెలంగాణ పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు టీకాలు సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలో వేయడం జరిగింది.వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయడం కంటే టీకా వేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, పశు వైద్యులు గంగప్రసాద్ ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి,శ్రీనివాస్, రవి, వార్డు సభ్యులు ఎం. డీ షబ్బీర్, అరికుప్పల రాజం,భుక్యా శేఖర్, ముష్కరి రమేష్,అల్లె చంద్రయ్య, మొరపు గంగరాజం, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి ,అటెండర్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు