navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 12:15 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పారిశుధ్య కార్మికురాలికి పరామర్శ

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని 6వ వార్డులో విధి నిర్వహణలో ఉన్న పారిశుధ్య కార్మికురాలు స్వప్నపై గురువారం ఉదయం వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో ఆమె ముఖం మరియు కాలిపై తీవ్ర గాయాలయ్యాయి .ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి , వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ , మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని స్వప్నను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ యంత్రాంగం ఆమెకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.