పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం
నవగీతం, మల్లాపూర్: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఆదివారం మల్లాపూర్ ఎం.పీ.డీ.ఓ జగదీశ్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మేజర్ పంచాయతీ కార్యాలయం లో పారిశుధ్య కార్మికులకు మాస్కులు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం, సన్మానించడం వారి కష్టాన్ని గుర్తించి, గౌరవించడం సామాజిక బాధ్యత అని, గ్రామస్థులందరి ఆరోగ్యాన్ని రక్షించే వారి ఆరోగ్యం కోసం వైద్య పరీక్షలు కూడా చేయిస్తున్నామని,పారిశుధ్య కార్మికులను సామాజిక వైద్యులు...