పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.

సర్పంచ్ మామిడి రాజు నవగీతం, ఇల్లంతకుంట గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేవని సర్పంచ్ మామిడి రాజు అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామపంచాయతీ సిబ్బందికి నిత్యవసర సరుకులు, ఆర్థిక సాయం అందజేసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు కఠిన పరిస్థితుల్లో శ్రమిస్తున్నారని, పారిశుధ్య కార్మికులు నడిచే దేవుళ్లని కొనియాడారు. మన అందరి ఆరోగ్య బాధ్యతలు వారే మోస్తున్నారన్నారు. పరిశుభ్రతకు మనవంతు సహకారం...