navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 7:53 am Digital Edition : NAVAGEETAM

15వ వార్డులో పారిశుధ్య పనులను పర్యవేక్షించిన కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్

నవగీతం, మెట్‌పల్లి :

మెట్ పల్లి పట్టణంలోని 15వ వార్డులో పారిశుధ్య పనులను కౌన్సిలర్ అరిగెల అనూష–రాకేష్ పర్యవేక్షించారు. వార్డులో పరిశుభ్రత మెరుగుపరిచేందుకు చేపడుతున్న పనులను పరిశీలించి, మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. చెత్త తొలగింపు, కాలువల శుభ్రత పనులు నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలు కూడా పరిశుభ్రతపై బాధ్యతగా వ్యవహరించి పరిసరాలను స్వచ్ఛంగా ఉంచాలని కోరారు