navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 1:34 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పుట్టినరోజు సందర్బంగా వృద్ధులకు అన్నదానం

యువతకు ఆదర్శం వికాస్…సేవ కార్యక్రమలలో పాల్గొన్నా స్నేహితులు.

నవగీతం,(భీంగల్ ప్రతినిధి )

భీంగల్ మండలంలోని బడా భీంగల్ గ్రామానికి చెందిన పుప్పాల వికాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాడు ఆర్మూర్, తగ్గం ఫౌండేషన్ అలాగే ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమాన్ని వికాస్ చేపట్టారు. అనంతరం ఆర్మూర్, నిజామాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్దగల, వృద్ధులకు, అనాధలకు ఆహార పొట్లాలను, తాగునీటి బాటిళ్లు తన పుట్టినరోజు సందర్భంగా వికాస్ అందజేశారు. అంతేకాకుండా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు వెళ్లి వికాస్ రక్తదానం చేసారు.ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో రక్తం అవసరం ఉంటే, వికాస్ త్వరితగతిన విషయం తెలుసుకుని రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. నేటి యువకులు తమ పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేయడం, బాణాసంచాలు, టపాసులు కాల్చడం, కూల్ డ్రింక్స్ తాగించడం, విందులు వినోదాలు లాంటివి వృధా ఖర్చులు మాని, పేదలకు, వృద్ధులకు వికలాంగులకు, అనాధలకు అన్నదానం, చలికాలం, వాన కాలంలో దుప్పట్లు అందించడం లాంటి సేవా కార్యక్రమాలు నేటి యువత చేపట్టి అనాధలకు, వికలాంగులకు, వృద్ధులకు సేవ చేయాలని వికాస్ పిలుపునిచ్చారు.