పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి : ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా ప్రజలకు, పోలీస్ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. జగిత్యాల, అక్టోబర్18,(నవగీతం) తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగ అని ఇలాంటి వేడుకలు సాంప్రదాయ విలువలను కాపాడటమే కాకుండా, కుటుంబ బంధాలను...