navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 1:54 pm Digital Edition : NAVA GEETAM

పూడూరు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. గూడ్స్ లారీ, కారు ఢీ

కొడిమ్యాల,అక్టోబర్01,(నవగీతం):

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ శివారులో ఆదివారం ఉదయం కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న గూడ్స్ లారీ, కారు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి, మెరుగైన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న కొడిమ్యాల పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.