navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 5:39 am Digital Edition : NAVAGEETAM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవగీతం, జగిత్యాల:

జగిత్యాల శ్రీ సరస్వతి విద్యానికేతన్ 1990- 91 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలోని ఆదివారం సంగీత్ బ్లాంకెట్ హాల్లో వైభవంగా నిర్వహించారు. దాదాపు 35 ఏళ్ళ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పదవ తరగతి పూర్వ విద్యార్థులు అందరు పాల్గొని ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ పాఠశాలలో గడిపిన చిన్ననాటి మధురస్మృతులను నెమరు వేసుకున్నారు.పాఠశాలను స్థాపించి కరస్పాండెంట్ గా విద్యా బుద్ధులు నేర్పించిన విద్యావేత్త ఇట్టే ప్రభాకర్ తో పాటు తమకు విద్యా బుద్దులు నేర్పిన పూర్వ ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించి జ్ఞాపికలను అందించారు. దాదాపు 50 మంది వరకు పాల్గొన్న ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు.