పెంపుడు కుక్కకు ‘నిలువెత్తు బంగారం’

శ్రీమాత డెవలపర్స్ చైర్మన్ వినూత్న మొక్కు నవగీతం,పెద్దపల్లి: జంతువుల పట్ల మానవత్వాన్ని చాటుకుంటూ,తన పెంపుడు కుక్కను కుటుంబ సభ్యుడిలా భావించే శ్రీమాత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాసర్ల రాజు ఒక అరుదైన మొక్కును తీర్చుకున్నారు.తన పెంపుడు కుక్క భైరవ గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురై,ఆహారం తీసుకోలేక అస్వస్థతకు లోనైన సమయంలో,ఆయన సమ్మక్క-సారక్క వన దేవతలను వేడుకున్నారు.కుక్క ఆరోగ్యం కుదుటపడితే జాతర సమయంలో దాని బరువుకు సమానమైన నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తానని మొక్కుకున్నారు.మొక్కుకున్న కొద్ది రోజుల్లోనే భైరవ కోలుకోవడంతో,ఆదివారం పెద్దపల్లి పట్టణంలో కాసర్ల...