పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ అభివృద్ధి చర్యలు అభినందనీయం
నవగీతం, నిర్మల్ నిర్మల్ జిల్లా పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ అభివృద్ధికి అధికారులు చేపట్టిన చర్యలు అభినందనీయమని నితి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రత్యేక అధికారి శిల్పా రావు అన్నారు.మంగళవారం పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ సందర్శన చేసినందున నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులతో కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ లో చేపట్టిన పనులు బాగున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా అధికారులు సమన్వయంతో పని చేసి...