navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 12:30 pm Digital Edition : NAVAGEETAM

పెద్దచెరువు ను పరిశీలించిన సర్పంచ్

నవగీతం,మల్లాపూర్:మల్లాపూర్ మండల కేంద్రములో పెద్ద చెరువు వద్ద నీటి ప్రవాహాన్ని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో పరిశీలించారు.గతంలో చెరువుకు గండి పడిన స్థలాన్ని పరిశీలించారు.మత్సకారులు భారీ వర్షాలు ముగిసే వరకు చేపల వేటకు చెరువు లోకి వెళ్లొద్దు,గ్రామస్తులు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి,వార్డు సభ్యులు ముష్కరి రమేష్, భుక్యా శేఖర్,మహమ్మద్ షబ్బీర్,ముత్యాల గంగారాజం,అల్లె చంద్రయ్య,శనిగారపు నరేష్, ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు