navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 5:04 pm Digital Edition : NAVAGEETAM

పెన్షన్ల నిలుపుదల నివారణకు లైవ్ సర్టిఫికెట్ తప్పనిసరి

25వ వార్డు కౌన్సిలర్ అస్ర ఫర్హీన్ జావిద్

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ఈరోజు వార్డు కౌన్సిలర్ అస్ర ఫర్హీన్ జావిద్, వార్డు ఆఫీసర్ మధులతతో కలిసి ఇంటింటికి తిరిగి మున్సిపల్ పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు లైవ్ సర్టిఫికెట్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ-కేవైసీ ద్వారా వేలిముద్రలు, కంటి స్కానింగ్, ముఖం స్కానింగ్ నిర్వహించి లబ్ధిదారుల వివరాలను నమోదు చేశారు.లైవ్ సర్టిఫికెట్ పూర్తి చేయని పక్షంలో పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉందని కౌన్సిలర్ అస్ర ఫర్హీన్ జావిద్ వార్డు ప్రజలకు సూచించారు. ప్రతి పెన్షన్ లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు మధులత, సాబేర తదితరులు పాల్గొన్నారు.