navageetam.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 11:03 am Digital Edition : NAVAGEETAM

పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి దాతల విరాళాలు

నవగీతం,కొడిమ్యాల

కొడిమ్యాల మండల కేంద్రంలోని ఊళ్లె పోచమ్మ తల్లి ఆలయం నిర్మాణ దశలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన వేముల మనోహర్ రూ.5,016 విరాళంగా అందజేశారు. అదే విధంగా చెన్న నరసయ్య–జమున దంపతులు కూడా రూ. 5,016ను శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు అందించారు.ఈ సందర్భంగా దాతలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎవరైనా భక్తులు పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి వస్తు రూపంలో గానీ, ధన రూపంలో గానీ సహాయం చేయదలచిన వారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఊళ్లె పోచమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు రాచకొండ చంద్రమోహన్, సభ్యులు జక్కుల మల్లేశం, రాజేశం, మహేష్, రమేష్ తదితరులు, అలాగే అన్ని కులాల పెద్దలు పాల్గొన్నారు.