navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 1:12 pm Digital Edition : NAVAGEETAM

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

కలెక్టరేట్ లో ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, సెప్టెంబర్10,(నవగీతం):తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మచిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిందన్నారు.వీరనారి చాకలి ఐలమ్మ త్యాగాలను స్మరిస్తూ, ప్రభుత్వం ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.వీరనారి చాకలి ఐలమ్మపేరిట మహిళా విశ్వవిద్యాలయం, ఏప్రిల్‌ 2022లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులోని కోఠి మహిళా కళాశాలను తెలంగాణ తొలి మహిళా విశ్వవిద్యాలయంగా ప్రకటించింది. ఆ తర్వాత 2024లో అది వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా అవతరించిందని వివరించారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మహిళలు స్ఫూర్తి పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజ గౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి కే. వై. ప్రసాద్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు.