navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 11:25 am Digital Edition : NAVAGEETAM

పోలింగ్ సామగ్రిని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్

నవగీతం జగిత్యాల ప్రతినిధి:

జిల్లాలో ఈనెల 11న జరిగే ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో పోలింగ్ సామగ్రిని తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ( బి. రాజ గౌడ్ మాట్లాడుతూ..పోలింగ్ కేంద్రాలతోపాటు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ లలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈనెల 9 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో  జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు