పోలింగ్ స్టేషన్లకు బయలు దేరుచున్న ఎన్నికల సిబ్బంది
ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో యస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి వార్డు ల వారిగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎన్నికల సామగ్రిని ఎన్నికల సిబ్బంది స్వీకరించి ఆయా పోలింగ్ స్టేషన్ లకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు సిబ్బందికి ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా,బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమిషన్మా ర్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు....