పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు వెలకట్టలేనివి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల, అక్టోబర్21,(నవగీతం) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు.విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవము సందర్భంగా పోలీస్...