navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 11:22 pm Digital Edition : NAVAGEETAM

పోలీస్ కళాబృందం చే ట్రాఫిక్,సైబర్ నేరాల పై అవగాహన

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మల్లాపూర్ పోలీస్ శాఖ  పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి గ్రామంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ నియమాలపై, సైబర్ నేరాల నివారణ, సామాజిక రక్షణ అంశాలపై ప్రజలకు చేరువ కావడానికి కళాబృందం చే అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై అనిల్  మాట్లాడుతూ..ఈ కళాబృందం ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు ముఖ్యంగా సైబర్ మోసాలు, ట్రాఫిక్ నియమాలు, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నివారణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యమన్నారు.ప్రజలు పోలీస్ శాఖతో సహకరించి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడాలని ఎస్సై అనిల్ కోరారు.ఈ కార్యక్రమంలో గుండంపల్లి గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య,  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, ఉపసర్పంచ్ జెగ్గుల గంగాధర్, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.