ప్రకృతిని కాపాడుకోవడం మానవుని బాధ్యత:

ప్రజాకవి, కాళోజి అవార్డు గ్రహీత జయరాజ్ సామజిక సమస్యలన్నిటికీ శాస్త్రీయ దృక్పధం ఏకైక ఆయుధం: విజ్ఞానదర్శిని రమేష్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: విశ్వంలో అంతర్భాగమై భూమిపై మానవ పరిణామంతో పాటు జీవజాతి మనుగడకు కారణమైన ప్రకృతిని కాపాడుకోవడం జీవజాతులన్నిటిలో ఉత్కృష్టమైన, విచక్షణ, వివేచనతో సమస్యలపై స్పందించి నిర్ణయాలు చేయగల మెదడు కలిగిన మానవుని బాధ్యత అని ప్రజాకవి, కాళోజి అవార్డు గ్రహీత జయరాజ్ అన్నారు.ప్రకృతిని రక్షించుకుంటే క్షేమం అదే ప్రకృతిని విస్మరిస్తే క్షామమని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రకృతి రక్షణ, వైజ్ఞానిక దృక్పధం,హక్కులు కల్పించిన రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా...